Telugu Morel Short Story - రాజాది రాజు - Best Story Collection For Kids - Short Stories for Kids

 రాజాది రాజు

Telugu Short Stories

ఒక మహారాజు ఒకరోజు ఏనుగునెక్కి తన పరివారంతో అరణ్యానికి బయల్దేరాడు. దారిలో ఒక సన్యాసి అడ్డంగా పడుకున్నడు. ఒక సిపాయి అతని వద్దకు వచ్చి, "మహారాజు వచ్చారు. అడ్డు తొలుగు" అన్నాడు. ఆ సన్యాసి ఫక్కున నవ్వి "ఓహో! అతడు మహారాజా? అయితే, నేను మహారాజుకే  రాజును, రాజాదిరాజును" అన్నాడు నవ్వుతూ సన్యాసి. ఈ మాటలను విన్న మహారాజు, "ఏమిటి! ఈ పిచ్చివాడు ఇలా మాట్లాడుతున్నాడు?" అని మనసులో అనుకొని ఏనుగుపై నుండి దిగి సన్యాసి వద్దకు వచ్చి అహంకారంతో నడుంపై చేతులు వేసుకుని "నీవు మహారాజువైతే! ఏది నీ దేశం? ఏది నీ రాజ్యం? ఎక్కడున్నది నీ ఖజానా? ఏరి నీ సిపాయిలు, పరివారం?" అని ప్రశ్నించాడు. ఆ సన్యాసి చిరునవ్వులు చిందిస్తూ "నేను ఏ దేశం పోయినా నన్ను గౌరవిస్తారు. నేను ఎక్కడుంటే అదే నా దేశం. అదే నా ఖజానా. నాకెవ్వరిపైనా ద్వేషం లేదు. నాకెవ్వరూ విరోధులు లేరు. కనుక నాకు సిపాయిలతో పని లేదు. ఇంక, రాజ్యమేదంటే ఆత్మ సామ్రాజ్యమే" అన్నాడు టీవిగా సన్యాసి. రాజుకు ఙ్ఞానోదయమై సన్యాసికి సాష్టాంగ ప్రణామం చేసాడు.


ఈ కథలోని నీతి అహంకారం ఎంతటివారికైనా తగదు.
 

1 comment:

Powered by Blogger.