Telugu Morel Short Story - మేకపోతు గంభీర్యం - Best Story Collection For Kids - Short Stories for Kids

మేకపోతు గంభీర్యం

Telugu Short Stories

 

                 అడివికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. రాత్రి అయింది. దానికి దారి తెలియక అటూ ఇటూ తిరిగ చివరుకు ఒక కొండ గృహ కనపడితే లోపలికి పోయి పడుకున్నది మేకపోతు.           
         కొంతసేపటికి ఆ గౄహలో నివసించే సింహం తన నివాస స్థలానికి  వచ్చి తన గృహలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము వాడి కొమ్ములూ ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని గృహలోనికి వెళ్ళక ఏమి చేయాలో తోచక బయటనే నిలబడి ఉన్నది.
         మేకపోతు గూడ సింహాన్ని చూడగానే గుండెలో గుబగుబలు బయలు దెరినివి. సింహం కూడ తనను చూచి భయపడినదని గమనించినది మేకపోతు. భయాన్ని బయటికి కనబడకుండా, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా? తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గృహ ముందుకు వచ్చి "ఎవరు నీవు?" అని గద్దించింది సింహాన్ని. "నేను సింహాన్ని... మృగరాజును...." అని భయంతో అన్నది. ధైర్యం కూడగట్టుకొని "ఓహో నీవేనా? ఆ సింహానివి? మృగరాజువు కూడానా? నా అదృష్టం పండింది. వెతకబోయినది కాలికి తగిలినట్లు నీ కొరకే వెతుకుతున్నను. వేయి ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరకు... ఈ గడ్డము తీయనని భీష్మ ప్రతిఙ్ఞ చేసాను. ఇప్పటికి నా దీక్ష పూర్తి అయినట్లే! నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను" అని రెండు కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడలిపోయి సింహం పరుగు లంకించుకుంది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళిపోయి, అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయినది.
 

ఈ కథలోని నీతి బలహీనులు కూడ ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయంతో ఎదుర్కోవచ్చు అనునది.

1 comment:

Powered by Blogger.