a children's book of stories
a collection of children's stories
Children Online Stories
children stories
children stories with morals
children's e stories
Kids Stories Online
Telugu Morel Short Story - ఆలోచనలేని తెలివి - Best Story Collection For Kids
ఆలోచనలేని తెలివి
ఒక ఊరిలో నలుగురు స్నేహితులు. వారు విఙ్ఞానంతో పాటు తమ పోషన కోసం ఇతర కళలను నేర్చుకోడానికి బయలుదెరారు. వారు ఒక గొప్ప యోగికి, సేవలు చేసి వారి అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నరు.
నలుగిరిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింప జేయగల నేర్పును పొందాడు. నాలుగావవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు.
ఈ నలుగురు నాలుగు దివ్యశక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వద్ద శెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడివి గుండా పోవాల్సివచ్చింది. కౄర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూచారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. "ఇది కౄర జంతువు దీన్ని బతికించితే అది మనలను చంపుతుంది" అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు "మనము దీన్ని బతికించాం, కాబట్టి మనలను ఏమి చేయదు" అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన్న సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడికి అబ్బిన విద్య రక్త ప్రసరణను కలగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కిన వాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.
ఈ కథలోని నీతి తెలివిలేని బలం విద్యా అనర్థాలకు దారి తీస్తుంది.
nice
ReplyDelete